News & Views

చర్చ : ములకలపల్లి , అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వన్యప్రాణులను వేటాడుతూ…

వన్యప్రాణులను వేటాడుతూ

వన్యప్రాణులను వేటాడుతూ ఓ వేటగాడు ఫారెస్ట్ అధికారులకు చిక్కాడు. మంగళవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం అడవి ప్రాంతంలో వేటగాడు ఉచ్చులు పెట్టి అడవి పందిని వేటాడి చంపాడు. ఈ విషయం అటవి అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక రేంజర్ రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని వేటగాడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నిందుతుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.