News & Views

చర్చ : సత్తుపల్లి, ఈనెల 15 న మెగా లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి…

ఈనెల 15 న మెగా లోక అదాలత్ సద్వినియోగం చేసుకోండి….

సత్తుపల్లి ఆరవ అదనపు జడ్జి ఎం శ్రీనివాస్…

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోకఅదాలత్‌ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి ఎమ్. శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పెద్ద సంఖ్యలో కేసులను వేగవంతంగా, పరస్పర సమ్మతితో పరిష్కరించడానికి లోకఅదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని సూచించారు. ప్రజలు పెద్ద మొత్తంలో కోర్టు ప్రక్రియలకు వెచ్చించే సమయం, ఖర్చులు తగ్గడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
లోకఅదాలత్‌లో ముఖ్యంగా సివిల్ వివాదాలు, కుటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కేసులు, బ్యాంకింగ్–ఫైనాన్స్‌కు సంబంధించిన లిటిగేషన్, చిన్నపాటి క్రిమినల్ కేసులు వంటి ఎన్నో కేసులను పరిష్కరించే అవకాశం ఉందని జడ్జి పేర్కొన్నారు.
వివాదాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అలాగే లోకఅదాలత్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో సమన్వయంగా పనులు జరుపుతున్నట్లు తెలిపారు.