చర్చ : సత్తుపల్లి , సింగరేణి నూతన జి.ఎం తో సత్తుపల్లి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం…


సింగరేణి నూతన జి.ఎం తో సత్తుపల్లి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం…
నూతనంగా ఏర్పాటైన సత్తుపల్లి సింగరేణి ఏరియాకు జనరల్ మేనేజర్ గా నియమితులైన చింతల.శ్రీనివాస్ తో సత్తుపల్లి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. దీనిలో భాగంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సింగరేణి కార్యాలయ వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాకు అందించడంలో సింగరేణి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు మీడియాను స్వాగతించాలని కోరారు. ఈ సందర్భంగా జి.ఎం చింతల.శ్రీనివాస్ స్పందిస్తూ సంస్థ బహిర్గత సమావేశాలకు మీడియాను స్వాగతిస్తామని, రానున్న రోజుల్లో మీడియా ప్రతినిధులతో సత్సంబంధం కలిగి వ్యవహరిస్తామని, ఈ దిశగా సింగరేణి కార్మికులకు, మీడియా ప్రతినిధులకు సత్తుపల్లి వేదికగా క్రికెట్ క్రీడ నిర్వహించే ఆలోచన ఉన్నట్లు జీ.ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.జీ.ఎం నరసింహారావు, ఎస్.ఓ.టు.జి.ఎం,ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.