News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , భద్రాచలం లో పోటెత్తిన భక్త జనం…

భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం. :

కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో తెల్లవారు జాము నుంచే భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, సమీప శివాలయాల్లో 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది లో దీపాలు వెలిగించి, నది ఒడ్డున దీపారాధన చేశారు.అనంతరం శివాలయాల్లో అభిషేకాలు,పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో ఉపవాస దీక్షలు చేసి,గోదావరి నది స్నానాలు ఆచరించి,దీపారాధన చేస్తే తాము తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగించి,ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.ఈ మాసంలో గోదావరి నది లో 365 వొత్తులు వెలిగించి, దీపారాధన చేస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని కూడా భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు భక్తులకు ఎంతో ప్రీతికరమైనవి.