చర్చ : హైదరాబాద్, కష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…
కష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…
ఒకవైపు అకాల వర్షాలతో నష్టపోయి ఉండగా, మరోవైపు ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసిన సీసీఐ, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయి ఉన్న పత్తి రైతులను మరింత నష్టాల్లోకి నెడుతున్న కేంద్ర ప్రభుత్వం. కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయి, మిగిలిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లగా, కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభం అవ్వడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న పత్తి రైతులు, ఇలాంటి కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి, ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు విధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఉన్నట్టుండి ఇలాంటి నిబంధన తెచ్చి, కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని వాపోతున్న పత్తి రైతులు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయమని అడగకుండా మొద్దు నిద్రలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం