News & Views

చర్చ : సత్తుపల్లి , దోషులను వెంటనే అరెస్టు చేయాలి సిపిఎం నిరసన…

దోషులను వెంటనే అరెస్టు చేయాలి సిపిఎం నిరసన..

ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు సిపిఎం రాష్ట్ర నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ సామినేని రామారావు ను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన గళము చేపట్టారు. సిపిఎం పార్టీ కార్యాలయం నుండి పట్టణ కేంద్రంలో దోషులను వెంటనే శిక్షించాలంటూ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు మాట్లాడుతూ 24 గంటల్లో దోషులను అరెస్ట్ చేయకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటంలు చేస్తూ ఇల్లు ఇళ్ల స్థలాలు కోసం తన భూమినే అమ్మి నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ సౌమ్యుడిగా ఉంటూ ప్రజల క్షేమం కోరె వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్యగాయించడం దురదృష్టకరమని వారికి నివాళులర్పించి గూండా రాజకీయాలు హత్యా రాజకీయాలను ఖండించారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే 24 గంటలలో దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.