చర్చ, అశ్వారావుపేట: వందేమాతరం కు 150 ఏళ్లు

వందేమాతరం కు 150 ఏళ్లు
చర్చ:- అశ్వారావుపేట.
వందేమాతర గీతం రచించి నూటయాభై వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించింది అని కొనియాడారు. వందేమాతరం పుట్టి 150 సంవత్సరాలు గడచిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వందేమాతర గీతలాపన చెయ్యాలని సూచించడంతో అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్యార్థులతో సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1875లో బకించంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం అనే నాటకంలో ఆలపించిన వందేమాతర గేయం స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో నూతనోత్సాహం నింపడంతో ఈ గేయాన్నే జాతీయ గీతంగా పరిగణించారని స్వాతంత్రోద్యమంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వందేమాతర గీతాన్ని స్థానిక వికేడీవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల, గౌతమి పబ్లిక్ స్కూల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక బీజేపీ నాయకులు కలిసి సామూహికంగా గీతాలాపన చేశారు