News & Views

చర్చ, సత్తుపల్లి:ఘనంగా వందేమాతరం వేడుకలు…

జాతీయ గీతం 'వందేమాతరం' 150 ఏళ్ల పూర్తి

ఘనంగా వందేమాతరం వేడుకలు…

చర్చ, సత్తుపల్లి:

కల్లూరు నగర పాలక సంస్థలో జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 ఏళ్ల పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ శ్రీ నాగేశ్వరరావు మాట్లాడుతు
వందేమాతరం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణను, ఐక్యతను కలిగించిన గీతం. 1875లో బంకిమ్ చంద్ర చంద్రచటర్జీ రచించిన ‘వందేమాతరం’ పాట మొదట ఆనందమఠ్ నవలలో చోటు దక్కించుకుంది. దేశాన్ని స్వాతంత్ర్య దిశగా నడిపించే ఉద్యమానికి ఈ గీతం ఎనలేని ప్రాధాన్యతను పొందింది. భారత జాతీయ గీతంగా దీనికి ప్రాముఖ్యత లభించడమేకాక, సమాజంలో మన, దేశభక్తి భావాలను రగిలించేలా చేసింది, అని తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పౌరులు ఐక్యతగా కలసి వందేమాతరం గీతాన్ని ఆలాపించారు.
మన మనుషులందరికీ దేశభక్తి, ఐక్యత విలువలు తెలియజేసే ఈ గీతాన్ని ప్రతిరోజూ తలుచుకోవాలి, అని మేనేజర్ శ్రీ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…