News & Views

చర్చ, పాల్వంచ : విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి.

 

 విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి.
అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సౌరబ్ శర్మ, IAS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

చర్చ.. పాల్వంచ

పాల్వంచ పట్టణంలోని బొల్లోరి గూడెం లో గల ప్రాథమిక పాఠశాల, మూడు అంగన్వాడీ కేంద్రాలను అలాగే మండలంలోని జగన్నాధపురం గ్రామంలోని ఉన్నత పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ ట్రైని సౌరబ్ శర్మ ఐఏఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బొల్లోరు గూడెం ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు గాను 26 మంది విద్యార్థులు మాత్రమే హాజరవ్వడం గమనించి ప్రధానోపాధ్యాయుడిని గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిరోజు మాట్లాడి, తగు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు.
విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ (FRS ) అటెండెన్స్ గురించి కేటాయించిన ట్యాబ్ వినియోగించకపోవడం పై ప్రశ్నించడం జరిగినది. సిమ్ కార్డు లేకపోవడంతో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలిని దానికి సంబంధించిన రిపోర్టు సమర్పించాలని ఆదేశించడం జరిగినది.
స్వచ్ఛత 5.0 లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించడం జరిగినది. మధ్యాహ్న భోజనం కొంతమంది విద్యార్థులు ఇంటి దగ్గర నుండి తీసుకురావడంపై ఆరా తీసి, విద్యార్థులకు నచ్చే విధంగా నాణ్యతతో మెనూ ప్రకారం వంట చేయాలని సూచించారు. అనంతరం జగన్నాధపురం ఉన్నత పాఠశాలనుసందర్శించి, స్వచ్ఛత క్యాంపెయిన్ 5.0లో భాగంగా స్క్రాప్ ను శుభ్రం చేసి పంచాయతీ వారి ద్వారా శుభ్రం చేయించవలసి ఉండగా, అలా జరగకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. IFP లను పరిశీలించి వాటిని రెగ్యులర్ గా వినియోగించక పోవడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించడం జరిగింది. IFP ద్వారా విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను కూడా పరిశీలించడం జరిగింది.
ఈ సందర్శనలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు SK. సైదులు, N. సతీష్ కుమార్ మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ, ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు రాజశేఖర్, CRP లు గంగరాజు, శ్రీనివాసరావు లు పాల్గొన్నారు