News & Views

చర్చ,పెద్దపల్లి: ప్రజల జీవన స్థితిగతులపై జాతీయ గణాంక శాఖ సర్వే …

ప్రజల జీవన స్థితిగతులపై జాతీయ గణాంక శాఖ సర్వే …

చర్చ,పెద్దపల్లి:

ప్రజల జీవన స్థితిగతులపై జాతీయ గణాంక శాఖ సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .
శుక్రవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ రామగుండం మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ అరుణ శ్రీ ని రామగుండం మున్సిపల్ కార్యాలయం లో కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యతను వివరించారు .
ఈ సందర్భంగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలలో రామగుండం ఉందని పట్టణాలు, గ్రామాలలో ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఉపాధి స్థితిగతులపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా రామగుండం పట్టణంలో సర్వే ప్రారంభించామని తెలిపారు. మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా 12 కుటుంబాలను ఎంపిక చేస్తామన్నారు .ఇందులో కుటుంబ యజమాని పేరు సభ్యుల వివరాలు విద్యార్హతలు, వృత్తివిద్య కోర్సులు స్వయం ఉపాధి తదితర అంశాలు నమోదు చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ రామగుండం మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ మరియు మున్సిపల్ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు గారు మున్సిపల్ వార్డు ఆఫీసర్ సంతోష్ కుమార్ .బిల్ కలెక్టర్ ఉమా రాణి మెప్మా సెక్షన్ అర్పి భాగ్యలక్ష్మి మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నా