News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు : కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్

చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం 3టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

జిల్లా పోలీస్ కళాజాత వారిచే కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో డ్రగ్స్‌పై అవగాహనా కార్యక్రమాల ఏర్పాటు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగుతున్న “చైతన్యం–డ్రగ్స్‌పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా శనివారం కొత్తగూడెం 3టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత సభ్యులు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిత్యం ఒక కంట కనిపెడుతూ, వారు చెడు మార్గంలో నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సూచించారు.
డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. డ్రగ్స్ రవాణా లేదా వినియోగంపై ఎవరైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.
తరువాత జిల్లా పోలీస్ కళాజాత సభ్యులు హాస్యాస్పదమైన స్కిట్లతో ప్రజలను అలరించి, డ్రగ్స్ మానవ జీవితంపై చూపే ప్రభావాన్ని చక్కగా చిత్రించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 2టౌన్ సీఐ డి. ప్రతాప్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్, 1టౌన్ సీఐ కరుణాకర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.