News & Views

చర్చ : ములకలపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ములకలపల్లి మండల పరిధిలోని పాత గంగారం గ్రామశివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం తెల్లవారుజామున విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని పాల్వంచ ప్రాంతం నుండి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చెరుకున్న ఎస్సై మధు ప్రసాద్ మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలిసిన వారు ములకలపల్లి పోలీసులను సంప్రదించవల్సిందిగా కోరారు.