చర్చ,భద్రాచలం: “పునర్వసు నక్షత్రం.. రామనామ గర్జనలు మార్మోగిన భద్రగిరి!”

“పునర్వసు నక్షత్రం.. రామనామ గర్జనలు మార్మోగిన భద్రగిరి!”
పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రగిరి గిరి ప్రదక్షిణ
చర్చ,భద్రాచలం:
పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలంలో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు జయ శ్రీరామ నినాదాలతో భద్రగిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులు గోదావరిలో పుణ్యస్నానం చేసి ఆలయంలో స్వామి వారి దర్శనం పొందారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తి భావంతో నిండిపోయింది. భద్రాచలం పరిసరాల్లో భక్తులతో కిక్కిరిసి పుణ్యక్షేత్రం పునర్వసు మహోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది