News & Views

చర్చ,మల్యాల: నిబందనలు పాటించని వాహనాలకు జరిమానా….

వాహనాలు తనిఖీ చేసిన ఎంవిఐ...

వాహనాలు తనిఖీ చేసిన ఎంవిఐ…
నిబందనలు పాటించని వాహనాలకు జరిమానా….

చర్చ,మల్యాల:

జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల క్రాస్ రోడ్ వద్ద జగిత్యా ఎం వి ఐ వెంకన్న ఆద్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.సరైన పత్రాలు లేని మూడు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విదించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు సరైన ధృవీకరణ పత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విదించారు. వాహనదారులు,లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ లేకుండా వాహనాలు నడపరాదని పేర్కొన్నారు.తాగి వాహనాలు నడిపితే బారీ జరిమాన తప్పదని హెచ్చరించారు.అవసరమైతే లెసెన్స్ క్యాన్సల్ చేస్తామని తెలిపారు.వాహనదారులు అన్ని దృవ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అదిక లోడ్ తో వాహనాలు నడిపిన ,నిబందనలు పాటించని డ్రైవర్లు,వాహన దారులపై చర్యలు తప్పవని జగిత్యాల ఎంవీఐ వెంకన్న తెలిపారు.