News & Views

చర్చ, జగిత్యాల: జాబ్ మేళాను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

 

జాబ్ మేళాను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
*
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చర్చ, జగిత్యాల ప్రతినిధి : బ్లూ ఓషన్ కంపెనీ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కంపెనీ పదవ తరగతి విద్యార్హత కలిగిన మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తోందన్నారు. 18 నుంచి 35 ఏండ్ల వయసు కలిగిన మహిళలందరు అర్హులేనని ఎంపికైన వారికి హైదరాబాద్ లో ఉద్యోగం కల్పించి 18 వేల వేతనం అందిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 14 న స్థానిక పద్మ నాయక కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ఎంపిక ప్రకియ కొనసాగుతుందని ఆసక్తి కలిగిన అర్హులైన వారందరూ ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ తుమ్మల సదాశివ రెడ్డి, నాయకులు
గిరినాగభూషణం, కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, గన్నె రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నారాయణ రెడ్డి, బాల ముకుందం, శ్రీనివాస్ రావు,మహేంద్రబాబు, జంబర్తి శంకర్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.