చర్చ,మేడ్చల్: హిజ్రాల ఘాతుకం.. నూతన గృహప్రవేశం రక్తపాతం..!

హిజ్రాల ఘాతుకం.. నూతన గృహప్రవేశం రక్తపాతం..!
చర్చ,మేడ్చల్:
నూతన గృహప్రవేశం వేడుక రక్తపాతం దిశగా మారింది. హిజ్రాల దాడితో యజమాని రక్తమోడాడు. వివరాల్లోకి వెళ్తే కీసర మండలం చీర్యాల గ్రామంలోని బాలాజీ ఎంక్లేవ్లో సదానందం అనే వ్యక్తి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఇద్దరు హిజ్రాలు అక్కడికి చేరుకుని రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారట.
యజమాని నిరాకరించడంతో ఆ ఇద్దరు వెళ్లి మరికొంతమందిని తెచ్చుకున్నారు. కొద్ది సేపటికే సుమారు 15 మంది హిజ్రాలు మూడుచోట్లుగా ఆటోల్లో వచ్చి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టి సదానందం సహా పలువురిని గాయపరిచారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఉత్సవం జరుపుకునే వేళ దాడికి పాల్పడిన హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు