చర్చ, మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధికి వేకువజాము నుండి బక్తులు పోటెత్తారు

చర్చ, మల్యాల:
కొండగట్టు అంజన్న సన్నిధికి వేకువజాము నుండి బక్తులు పోటెత్తారు.పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని సర్వ దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఘాట్ రోడ్డుపై ఇరువైపుల వాహనాలు పార్కింగ్ చేయడంతో కొండ పైకి వెళ్ళే వాహనాలకు అంతరాయం ఏర్పడడంతో కాళ్ల నడకన వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు చేరుకొని వాహనాలను క్రమబదీకరించారు