News & Views

చర్చ : గోదావరిఖని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి…

పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి….

పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజా సేవలో, నేర నిరోధక కార్యక్రమాల్లో నిమగ్నమై అధిక పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆందోళన, భద్రతా ప్రమాణాలు, మానసిక దైర్యం స్వీయ క్రమశిక్షణ, మరియు విధి నిర్వహణలో ప్రవర్తన పై వ్యక్తిగత భద్రత,స్వీయ క్రమశిక్షణ,ప్రవర్తన నియమావళి పై రామగుండం కమీషనరేట్ లో సి.పి.అంబర్ కిషోర్ ఝా ఆద్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈసందర్బంగా సిపి మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధి నిరర్వహణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతత, సహనం పాటించడం, సహచరుల మధ్య పరస్పర గౌరవం, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం వ్యవహారించాలని అన్నారు. పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలంటే వ్యక్తిగత స్థాయిలో క్రమశిక్షణ, ప్రవర్తనా ప్రమాణాలు అత్యంత అవసరమని సూచించారు.
ఒత్తిడి, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొనే పద్ధతులు, ఆత్మహత్య ఆలోచనలు రాకుండా మానసిక దైర్యాన్ని అలవరుచుకోవాలని సూచించారు.వ్యక్తిగత జీవనశైలి మరియు కుటుంబ సమతుల్యత వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక సలహాలు అందించారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఎంవి ఐ సంతోష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, సైకాలజిస్ట్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, సిసి హరీష్, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.