చర్చ,వేములవాడ: వేములవాడ ఆలయ దర్శనం నిలిపివేత …

చర్చ,వేములవాడ:
వేములవాడ ఆలయ దర్శనం నిలిపివేత …
భక్తుల్లో ఆగ్రహం….
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అదికారులు భక్తుల దర్శనాలు అకస్మాత్తుగా నిలిపివేశారు.
అర్ధరాత్రి సమయంలోనే ఆలయ ప్రధాన ద్వారం మూసివేసిన అదికారాలు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో దూర ప్రాంతాల నుండి ఉదయం దర్శనాల కోసం వచ్చిన భక్తులు అయోమయానికి గురయ్యారు.ముందస్తు ఎటువంటి సమాచారం లేకుండానే దర్శనాలు నిలిపివేయడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.“రాత్రికి రాత్రే ఆలయాన్ని మూసేయడం సరైంది కాదు, కనీసం ముందుగానే ప్రకటించాలి” అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా స్వామి వారి ప్రచార రథం ద్వారా నేటి నుండి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శనాలు ఉంటాయి అని సమాచారం వినిపిస్తుంది ,భీమేశ్వరాలయం లో దర్శనాలు చేసుకొని మొక్కులు చెల్లించు కొనే విధంగా ఇప్పటికే ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ కాగా అధికారుల ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణాలు ఏంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తిస్థాయిలో అభివృద్ధి అయ్యేవరకు నిలిపివేతన లేదా తాత్కాలిక దర్శన నిలిపివేతన అనే అంశాలపై అధికారుల స్పష్టత ప్రకటన ఇంకా రాలేదు అయితే ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరగకుండా నియంత్రణ చర్యలేనా? లేక ఇతర కారణాల వలననా అనే దానిపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఆలయం దర్శనాలు నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయ మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి వెళ్తున్నారు