చర్చ,మల్యాల: ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష

ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష
సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
చర్చ,మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులుతో పాటు రైస్ మిల్లర్లతో జేఎన్టీయులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతులు చేసుకోవాలని ఆదేశించారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17 % లోపు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని రైతులకు సూచించారు.
రైతులు వరి కోతల తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పొలం నుండి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావద్దని రైతులను కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
రైతులు తేమశాతం వచ్చేవరకు ధాన్యం ఆరబెట్టాలని తెలిపారు.
రైతులు ఆరిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వస్తే వెంటనే కాంటా వేసి సంబంధిత మిల్లులకు నిర్వాహకులు ధాన్యాన్ని తరలిస్తారని అన్నారు.
రైతుల వివరాలు వెంటనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందించాలని తెలిపారు.
కొనుగోలు కు సంబందించిన సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం దిగుమతులు చేసుకోవాలని ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, డిఎస్వో జితేందర్ రెడ్డి, డిసివో మనోజ్ కుమార్, డి ఏం జితేంద్ర ప్రసాద్ మరియు ఎమ్మార్వో లు, ఎంపిడివోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.