
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం …
ముగ్గురు కార్మికులకు గాయాలు…
చర్చ,గోదావరిఖని:
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా వన్ జీడికే లెవన్ ఇంక్లైన్ (Gdk 11 incline)బొగ్గు గని లో ప్రమాదం చోటుచేసుకుంది.బుధవారం రెండవ షిఫ్ట్ లో యాబై ఐదవ లెవల్, ఐదవ డీప్ వద్ద పని స్థలంలో లోడ్ హాల్ డంపర్ ఒక్కసారి ఆన్ కావడం తొ పక్కనే విదులు నిర్వహిస్తున్న ప్రవీణ్,రంజిత్ ,శ్రీకాంత్ అనే ముగ్గురు కార్మికులకు కేబుల్ తాకడం తో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు అదికారులకు సమాచారం అందించారు.ప్రమాదంలో గాయపడిన కార్మికులను వెంటనే గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన ఇద్దరికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా,తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను అదికారులు,కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు.ప్రమాద ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కార్మిక సంఘాలు నాయకులు మాట్లాడుతూ కార్మికులపై అదికంగా పనిబారం మోపడం,
పనిస్థలాల్లొ, రక్షణ చర్యలు చేపట్టకపోవడం,అదికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని,బాద్యులైన అదికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి నాయకులు ఆరెల్లి.పోశం సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు