News & Views

చర్చ,పెద్దపల్లి: కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు.

48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు.

చర్చ,పెద్దపల్లి ప్రతినిధి:

కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు.
48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంబించిన
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు.

కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట ,వెన్నంపల్లి గ్రామాల్లో గురువారం ఐకేపీ,సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంబించారు.ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు.వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న రైతులుసంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య , మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు,అదికారులు రైతులు పాల్గొన్నారు