News & Views

చర్చ : రామగుండం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులు ప్రారంబించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్..

రామగుండం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులు ప్రారంబించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్..

జనగామ గ్రామంలో 45 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
మరో మూడు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజిలు,రోడ్ల వెడల్పు పనులు చేయనున్నట్లు తెలిపారు.గ్రామంలో ఐకెపి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు అదైర్య పడవద్దని భరోసా కల్పించారు. జనగామ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం గోదావరిఖని ప్రదాన చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ గోదావరిఖని అభివృద్ధి కోసం పలు నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు.షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మరింత చేరువలో , వాణిజ్య,వ్యాపారాల విస్తరణకు కృషిచేస్తామన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదన్నారు