News & Views

చర్చ,గోదావరిఖని: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత…

 

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత…

చర్చ,గోదావరిఖని:

బొగ్గు నాణ్యతకు సింగరేణి అదిక ప్రాధాన్యత ఇస్తుందని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్(ఆపరేషన్స్)ఎల్ వి సూర్యనారాయణ అన్నారు.
ఈ నెల13 నుంచి 19 వరకు బొగ్గు నాణ్యత వారోత్సవాలు సింగరేణి వ్వాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
గురువారం నాణ్యత వారోత్సవాల సందర్భంగా రామగుండం ఏరియా వన్ జీడికే కోల్ మైన్ లో ఏర్పాటు చేసిన బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే వినియోగదారులకు అడిగిన విదంగా నాణ్యమైన బొగ్గు ను సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఉత్పత్తి వ్యవయాన్ని తగ్గించే విదంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో
ఆర్జీవన్ ఏరియా జియం డి లలిత్ కుమార్ , రామగుండం రీజియన్ క్వాలిటీ జియం ముజుందార్, జియం సేఫ్టీ ఎస్ మధుసూదన్ ,ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మడ్డి ఎల్లాగౌడ్,ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ అరెల్లి పోశం,సీఎంఓఏఐ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్,ఎస్ఓటు జిఎం కె. చంద్రశేఖర్,పిఒ డి రమేష్
ఆర్జీ వన్ ఏరియా గనులు, డిపార్ట్మెంట్ అధికారులు,ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు