చర్చ, సత్తుపల్లి : సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు

సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు…
చర్చ, సత్తుపల్లి :
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్ట దయానంద్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్లో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ సత్తుపల్లి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ నవీన్ యాదవ్ గెలుపుకు సహకరించిన జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.