చర్చ,వైరా : నవీన్ యాదవ్ గెలుపు పట్ల జవ్వాజి నాగరాజు హర్షం
నవీన్ యాదవ్ గెలుపు పట్ల జవ్వాజి నాగరాజు హర్షం
*నవీన్ యాదవ్ గెలుపు పట్ల జవ్వాజి నాగరాజు హర్షం*
చర్చ,వైరా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం పట్ల వైరా మండలం తాటిపూడి కి చెందిన కాంగ్రెస్ నాయకుడు యాదవ సంఘం మండల అధ్యక్షుడు జవ్వాజి నాగరాజు హర్షం తెలిపారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులను గుర్తించి సముచిత స్థానం ఇచ్చినందుకు మాట నిలబెట్టుకున్న జూబ్లీహిల్స్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు .అదేవిధంగా యాదవ సంఘం తరఫున నవీన్ యాదవ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నానని జవ్వాజి నాగరాజు అన్నారు.