చర్చ,హైదరాబాద్ : ఆదర్శ ఫౌండేషన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు..
ఆదర్శ ఫౌండేషన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు..
చర్చ,హైదరాబాద్ :
హైదరాబాద్లోని ఆదర్శ ఫౌండేషన్ లో ఉన్న చిన్నారుల నడుమ ఐటీ కంపెనీలైన సెక్యూర్ ఎక్స్ ఫర్ట్స్, పీఆర్ వేర్ ఐటి సొల్యూషన్స్, ఎంఇ టెక్ (ఇండియా, యుకె) ప్రతినిధులు చిల్డ్రన్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఫౌండేషన్ లో ఉన్న చిన్నారుల అవసరాలను తెలుసుకుని వారికి మేనేజ్ మెంట్ల సహకారంతో యూనిఫార్మ్ లు, బ్యాగ్లు, నిత్యావసర సామాగ్రి పంపిణీ చేశారు. రోజంతా చిన్నారులతో కలిసి ఐటీ టెక్ లు ఆనందంగా గడిపారు. వారితో భోజనం చేసి ఉల్లాసాన్ని నింపారు. పిల్లల చదువు, ఆరోగ్యం, వారి అభివృద్ధికి తమ వంతు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని ప్రతినిధులు తెలిపారు.