News & Views

చర్చ,మంచిర్యాల: సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసిబి తనిఖీలు…

 

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసిబి తనిఖీలు…

చర్చ,మంచిర్యాల:

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరించారు. కార్యాలయంలో ప్రతి రోజు జరిగే వివిద రిజిస్ట్రేషన్లను తనిఖీ చేశారు. డాక్యుమెంట్స్ ఎల్ఆర్ఎస్, లే అవుట్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఏసీబీ సోదాలు జరపడం చర్చకు దారితీసింది.విషయం తెలిసిన డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలు మూసివేశారు. రొటీన్ చెకప్ లో భాగంగానే ఈ సోదాలు చేశామని ఏసీబీ డిఎస్పి మధు తెలిపారు