చర్చ, సత్తుపల్లి: చనిపోయిన వ్యక్తి ఖాతాలో రూ.3 లక్షల నగదు స్వాహా
సత్తుపల్లి పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు

చనిపోయిన వ్యక్తి ఖాతాలో రూ.3 లక్షల నగదు స్వాహా
పలు దపాలుగా ఫోన్ ఫేం ద్వారా నగదు నగదు విత్ డ్రా
సత్తుపల్లి పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు
చర్చ, సత్తుపల్లి:
చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్ ఫేం ద్వారా పలు దపాలు గా నగదు విత్ డ్రా చేసి కాజేసిన సంఘటన సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సత్తుపల్లి పట్టణ పరిధిలోని హనుమాన్ నగర్ కు చెందిన కిన్లీ వాటర్ బాటిల్ ఫ్యాక్టరీ లో ఉద్యోగిగా పనిచేసిన ఆలేటి ప్రసాద్ (45) మూడు నెలల క్రితం అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందగా స్థానిక గా ఓ బ్యాంక్ లో ఆలేటి ప్రసాద్ కు చెందిన బ్యాంక్ అకౌంట్ ను ఫోన్ పే ద్వారా రూ. 3 లక్షల రూపాయలు పలు దపాలు గా విత్ డ్రా చేయగా ప్రసాద్ కుటుంబ సభ్యులు శుక్రవారం స్థానిక బ్యాంకు వెళ్లి నగదు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా అకౌంట్లో ఉన్న నగదు బదిలీ అయినట్లు బ్యాంకు మేనేజర్ తెలపగా వారి కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు మెయిన్ రోడ్ నందు గల ఈ నేల 1.తేది న ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కేంద్రం నుంచి రూ.48.వేలు నగదు విత్ డ్రా చేసిన సమయంలో సీసీ కెమెరాలు నమోదైన ఛాయాచిత్రం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.