News & Views

చర్చ, భద్రాచలం: ఆంధ్రా సరిహద్దు ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా గోవధశాలలకు అక్రమంగా గోవుల తరలింపు

గోవధశాలలకు అక్రమంగా గోవుల తరలింపు

భద్రాద్రికొత్తగూడెం,భద్రాచలం :

భద్రాచలం ఆంధ్రా సరిహద్దు ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా గోవధశాలలకు గోవులను అక్రమంగా తరలిస్తూన్న 2 డీసీఎం వ్యానులను పోలీసులు పట్టుకున్నారు.చాలా రోజులుగా భద్రాచలం ఏజెన్సీ మార్గంగా హైదరాబాద్ కేలేబరాలకు గోవుల రవాణా జరుగుతుందన్న సమాచారం నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు…
ఈరోజు ఉదయం భారీగా గోవులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తరువాత వాటిని పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు.

కొనసాగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.