చర్చ భద్రాద్రి: భద్రాద్రి జిల్లా బంజారా సంఘాల జేఏసీలో పాల్వంచవాసులకు కీలక బాధ్యతలు
బంజారా సంఘాల జేఏసీలో పాల్వంచవాసులకు కీలక బాధ్యతలు

భద్రాద్రి జిల్లా బంజారా సంఘాల జేఏసీలో పాల్వంచవాసులకు కీలక బాధ్యతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో పాల్వంచకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ, ఇతర వర్గాలలో యాక్టివ్‌గా ఉన్న పలువురికి జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్ తెలిపారు. ఈ రోజు పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షులుగా భూక్య రమేష్ రాథోడ్, బానోత్ రాములు, ప్రధాన కార్యదర్శులుగా బానోత్ బాలు నాయక్, భూక్య చందు నాయక్, జేఏసీ కో కన్వీనర్లుగా గుగులోత్ భద్రు నాయక్, బానోత్ భరత్, భట్టు మంజుల, తేజావత్ రాములు నాయక్, శంకర్ సాధు, బానోత్ నాగేశ్వరరావు, బాబులాల్ నాయక్, సపావట్ బాలకృష్ణ భూక్య గిరి ప్రసాద్ , భూక్య శంకర్ , బాదావత్ నాగేశ్వరరావు , ఆంగోత్ బాలాజీ , జరుపుల పరమేష్ ,నియమించినట్లు తెలిపారు.