చర్చ, జగిత్యాల యాదవ హక్కుల సాధనకై సంఘటితమైదాం – జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేశం యాదవ్
యాదవ హక్కుల సాధనకై సంఘటితమైదాం

యాదవ హక్కుల సాధనకై సంఘటితమైదాం
జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేశం యాదవ్
చర్చ, జగిత్యాల : యాదవ హక్కుల సాధన కోసం అందరం సంఘటితమైదామని యాదవ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. శనివారం భీమారం మండలం లోని కమ్మరిపేట లో యాదవ కులస్తులతో సమావేశం నిర్వహించారు.
ఇందులో జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యులు అలిశెట్టి బుచ్చి రాములు యాదవ్, , మహేష్ యాదవ్, మొండయ్య యాదవ్, మండల నాయకులు మహేష్ యాదవ్, భైర శ్రీనివాస్ యాదవ్, పంచతి రాజేష్ యాదవ్, వంగ లింగం యాదవ్ లతో కలిసి సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు.
అనంతరం కమ్మరి పేట గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 84 మంది సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులను అందించారు.