News & Views

చర్చ, జగిత్యాల: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

చర్చ, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని సిరికొండ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్దుల, ట్రాన్స్ జెండర్ ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు మౌళిక వసతులు కల్పించాలని,
హమాలీల కొరత లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో రోజువారిగా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలనీ సూచించారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే నిర్వాహకులకు ఆధార్, పాసుబుక్ కాపీలను ఇచ్చి వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు.
రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్ణిత నిబంధనల మేరకు ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.
అధికారులు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్ ఇంచార్జి లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత,
అధికారులు, రైతులు పాల్గొన్నారు.