News & Views

చర్చ ,వేములవాడ: రాజన్న ఆలయానికి దారేది… నిర్మాణ పనులతో దారి మళ్ళింపు…

సరైన చర్యలు చేపట్టిని అదికారులు...

చర్చ ,వేములవాడ:
రాజన్న ఆలయానికి దారేది…
నిర్మాణ పనులతో దారి మళ్ళింపు…

సరైన చర్యలు చేపట్టిని అదికారులు…

సూచిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు..
దారి తెలియక వాహదారుల అగచాట్లు…

భారీగా ట్రాపిక్ జాం…

అసౌకర్యాల నడుమ రాజన్న దర్శనం.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు సాగుతున్న నేపథ్యంలో… భక్తులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ముఖ్యంగా సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి
వేములవాడ దేవస్థానం పరిసరాల్లో జరుగుతున్న పనుల కారణంగా భక్తుల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏ దారి మూసి ఉందో, ఏ దారి ద్వారా వెళ్లాలన్నదానిపై స్పష్టమైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల భక్తులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో… దేవస్థానం వైపు వస్తున్న వాహనదారులను ఒక కానిస్టేబుల్ అడ్డుకోవడంతో అక్కడ చిన్న ఉద్రిక్తత నెలకొంది. లోపలికి పంపితే లోపల ఉన్న సిబ్బంది తిరిగి అనుమతించకపోవడంతో వాహనదారులు, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చెలరేగింది.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాలను వెనక్కి మళ్లించారు.