చర్చ, జగిత్యాల: జగిత్యాల లో కొనసాగిన ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం

జగిత్యాల లో కొనసాగిన ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
చర్చ, జగిత్యాల:ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం ఈ ఆదివారం జగిత్యాల లో కొనసాగింది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అవగాహనా చేసుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని
ప్రజా సంఘాల జెఏసి రాష్ట్ర అధ్యక్షులు,టిఎస్జేయు జిల్లా అధ్యక్షులు పేట భాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా సంఘాల జెఏసి రాష్ట్ర అధ్యక్షులు, టిఎస్జేయు జిల్లా అధ్యక్షులు పేట భాస్కర్ పాల్గొని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో ఘన నివాళ్లు అర్పించి మహానుభావుని సేవలను స్మరించారు.