చర్చ,రామగుండం: రాజీవ్ రహదారిపై ప్రమాద స్థలాల గుర్తింపు…. ప్రమాదాల నివారణ చర్యలకు దిశా నిర్దేశం…
ప్రమాదాల నివారణ చర్యలకు దిశా నిర్దేశం...

చర్చ,రామగుండం: రాజీవ్ రహదారిపై ప్రమాద స్థలాల గుర్తింపు….
ప్రమాదాల నివారణ చర్యలకు దిశా నిర్దేశం…
బ్లాక్ స్పాట్ ను సందర్శించిన రామగుండం పోలీస్ కమీషనర్…
రాజీవ్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు అరైవ్.. అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ ఆర్ కె సంస్థ అధికారులతో కలిసి గోదావరిఖని బి – గెస్ట్ హౌస్ మూల మలుపు, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదాల నివారణకు టర్నింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ డిజైన్, రేడియం బ్లింకర్స్, స్టడ్స్, సిసి కెమెరాల ఏర్పాటు ప్రమాద స్థలాల గుర్తింపు, తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. రోడ్డు సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి, కారణాలపై సమీక్షా జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ
మద్యం సేవించి వాహనాలు నడపడం రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణాల వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నది వారణకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత రామగుండం కమీషనరేట్ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.