చర్చ, జగిత్యాల: పొగమంచు నేపథ్యంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి -జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
పొగమంచు నేపథ్యంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి

పొగమంచు నేపథ్యంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చర్చ, జగిత్యాల: ప్రస్తుత చలికాలంలో సాధారణ చలి స్థాయి నుంచి అతి శీతల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రోడ్లపై పేరుకుపోతున్న పొగమంచు కారణంగా వాహనాలను నడిపే డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్త లు తీసుకొంటూ వాహనాలను నడపాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. సోమవారం విడుదల చేసిన ప్రకటన లో శీతాకాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ఉదయం, రాత్రి వేళల్లో రహదారులపై పొగమంచు అధికంగా ఏర్పడుతోందన్నారు. దీనితో ముందున్న వాహనాలు స్పష్టంగా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో అన్ని వాహనదారులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.