News & Views

చర్చ పెద్దపల్లి : గుంజపడుగు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్ రావు- నాగమణి దంపతుల హత్య సంఘటనపై సిబిఐ ఎంక్వైరీ కి హాజరైన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

చర్చ పెద్దపల్లి జిల్లా:

సిబిఐ విచారణకు హాజరైన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు ….
చర్చ,రామగుండం:

పెద్దపల్లి జిల్లా లో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ ముమ్మరం చేసింది ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన సిబిఐ ఈరోజు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులను విచారిస్తుంది.
ఇందుకోసం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి మూడు వాహనాలలో పుట్ట మధు చేరుకున్నారు. గట్టు వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసుతో సంబంధం ఉన్న వారిని సిబిఐ విచారిస్తుంది. కమిషనరేట్ కార్యాలయం వద్ద పుట్ట మధు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.