News & Views

చర్చ : కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం నందు 18.11.2025 న ప్రత్యేక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం…

ది సింగరేణి కాలరీస్ కంపెనీలిమిటెడ్
(ప్రభుత్వ సంస్థ)

కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం నందు 18.11.2025 న ప్రత్యేక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

మన ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.బలరామ్, ఐ‌ఆర్‌ఎస్ మరియు డైరెక్టర్ పా శ్రీ గౌతం పోత్రు ,IAS గారి సూచనల మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో నవంబర్ 18 వ తారీఖున కార్పొరేట్ మరియు కొత్తగూడెం ఏరియా లలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు , రిటైర్డ్ కార్మికులు మరియు వాళ్ళ కుటుంబసభ్యులకు కార్పొరేట్ ఏరియాలోని ప్రకాశం స్టేడియం నందు 18.11.2025 న ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కావున కార్పొరేట్ మరియు కొత్తగూడెం ఏరియా లో పనిచేసే రెగ్యులర్,కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, మెడికల్ కార్డ్ హోల్డర్స్ మరియు వారి 35 సంవత్సరాల పై ఉన్న మహిళా కుటుంబ సభ్యులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మరియు వైద్య పరీక్షలకు వచ్చే వారు పరీక్షల కొరకు ఉదయం 9 .00 గంటల నుంచి ప్రకాశం స్టేడియం కి రావాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీ ఆర్. కిరణ్ రాజ్ కుమార్ గారు తెలిపారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్.