చర్చ : పాల్వంచ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిషత్ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిషత్ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని కోరారు,డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ సుధా లక్ష్మి, ఏపీవో పోరండ్ల రంగా, ఏఈ శ్రీనివాస్, కార్యాలయం సిబ్బంది వీరబాబు, శారద, లక్ష్మణ్, రోహిణి, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు