News & Views

చర్చ , వనపర్తి: రూ. 20 వేలు లంచం తీసుకుంటూ అనిషా వలలో చిక్కిన టీజీఎస్‌పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

అనిషా వలలో టీజీఎస్‌పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

 

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ అనిషా వలలో చిక్కిన టీజీఎస్‌పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

ఫిర్యాదుదారుని బంధువుకి చెందిన వ్యవసాయ భూములకు డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరు చేయాలన్న పేరుతో 40,000/- లంచం డిమాండ్ చేసిన టీజీఎస్‌పిడిసిఎల్ అధికారిని ఈరొజు అవినీతి నిరోధక శాఖ (ఏసిబి ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

గోపాల్‌పేట సెక్షన్‌కు చెందిన సహాయక ఇంజనీర్ (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి
డిటిఆర్ ఏర్పాటుకు మొత్తం రూ.40,000/- లంచం అడిగినట్లు ఏసీబీ తెలిపింది. అందులో భాగంగా రూ.20,000/- స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఎలాంటి ప్రభుత్వ సేవకుడు లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖను సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది.
ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్: 1064