News & Views

చర్చ,గోదావరిఖని: ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం . రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్…

ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం

చర్చ,గోదావరిఖని:

ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యం .
రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్…

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ , జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తో కలిసి పరిశీలించారు.
నూతన భవన నిర్మాణం, వార్డుల ఆధునీకరణ పనులను పరిశీలించారు.
పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. రోగుల కోసం అవసరమైన పరికరాలు, సిబ్బంది, అత్యవసర సేవలను మరింత బలోపేతం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంటు, సంబంధిత శాఖల అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు