News & Views

చర్చ, ములుగు జిల్లా : పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపిన బిజెపి శ్రేణులు స్థానిక రైతులు

పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపిన స్థానిక రైతులు

పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపిన బిజెపి శ్రేణులు స్థానిక రైతులు

చర్చ ములుగు జిల్లా బ్యూరో నవంబర్ 19: (మంగపేట)

మండలంలోని రాజుపేట (సబ్ బ్రాంచ్) సొసైటీ ఆఫీస్ నందు మండల అధ్యక్షులు రావుల జానకిరావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ బిజెపి నాయకులు జానకిరావు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మానిథి పథకంలో భాగంగా 21 వ ఇనిస్టాల్మెంట్ యావత్ భారతదేశం రైతు సోదరులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందనీ మంగపేట మండల రైతు మిత్రులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజల పక్షాన ఉండే సంక్షేమ పథకాలు మరెన్నో చేపడుతున్నారు ప్రతిదీ కూడా అందరూ సద్విని చేసుకోవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (సీనియర్ నాయకులు) మరియు మాజీ మండల అధ్యక్షులు యర్రంగారి వీరన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి బడే జగన్మోహన్, మండల కార్యదర్శి గుండారపు రోహిత్ కుమార్, బట్ట సతీష్, సీనియర్ నాయకులు బట్ట బాబురావు గారు, ఇందారపు ప్రతాప్ రాజుపేట, రమణక్కపేట బూత్ కమిటీ సభ్యులు మరియు రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.