చర్చ ములుగు జిల్లా: ఇసుక లారీలకు వ్యతిరేకంగా రహదారిని నిర్బంధించిన మంగపేట ప్రజలు
రహదారిని నిర్బంధించిన మంగపేట ప్రజలు

ఇసుక లారీలకు వ్యతిరేకంగా రహదారిని నిర్బంధించిన మంగపేట ప్రజలు
చర్చ ములుగు జిల్లా బ్యూరో నవంబర్ 18:
(మంగపేట)
ములుగు జిల్లా ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మంగపేట రహదారి మీదుగా రోజుకు వందల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్తుండడంతో తీవ్రమైన దుమ్ము ధూళి లేస్తూ రహదారి ప్రక్కనే ఉన్న నివాసితుల ఇండ్లపై వస్తువులపై పడుతుండడంతో విసిగిపోయిన ప్రజలు ఇసుక లారీలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఏటూరు నాగారం _ బూర్గంపాడు ప్రధాన రహదారిపై ఇసుక లారీలను స్థానిక గ్రామస్తులు అంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇసుక లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. లారీల వల్ల వచ్చే దుమ్ము ,ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. నిత్యం లారీల రవాణా కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయిందని అన్నారు.
వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై టీవీ ఆర్ సూరి రోడ్డుపై బైఠాయించిన ప్రజల తో చరవని లో మాట్లాడి దుమ్ము లేవడానికి కారణమైన గుంటలను రెండు రోజుల్లో మరమ్మత్తులు చేపిస్తానని మాట ఇవ్వడంతో స్థానికులు నిరసన విరమించుకున్నారు.