News & Views

చర్చ, సత్తుపల్లి: తూకాల్లో మోసం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు – లైసెన్స్ లేకుండా అక్రమ వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు…

లైసెన్స్ లేకుండా అక్రమ వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు...

తూకాల్లో మోసం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు….

లైసెన్స్ లేకుండా అక్రమ వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు…

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

కాటలో మోసం రైతులు జాగ్రత్త..

చర్చ, సత్తుపల్లి:

తల్లాడ మండలంలో పలు గ్రామాలలో పత్తి కొనుగోలు చేస్తూ ఎలక్ట్రానిక్ కాటాల్లో రిమోట్ తో పత్తి తూకాన్ని తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై వెంకటకృష్ణ మాట్లాడుతూ
తల్లాడ మండలానికి చెందిన ఏలాంటి అనుమతులు లేకుండా పత్తి వ్యాపారం చేస్తున్న పలువురు వ్యక్తులు
ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ తో క్వింటాకు15 కేజీల నుంచి 20 కేజీలు తక్కువ చూపిస్తూ మోసం చేస్తుండగా తల్లాడ పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వారితో పాటుగా
6 టాటా ఏసీ వాహనాల తో పాటు ఆరు ఎలక్ట్రానిక్ కాటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న
60 మంది వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశారని అన్నారు.రైతులు ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలను అమ్ముకునే ప్రయత్నంలో దళారులు అక్రమ పద్ధతిలో కాటాలలో మోసం చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలిపారు.అలాంటి వ్యాపారులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.