News & Views

చర్చ , హైదరాబాద్ :కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవిత అరెస్ట్
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నాంపల్లిలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు
చర్చ , హైదరాబాద్ :తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ కవిత హెచ్ఎంఎస్ కార్యకర్తలతో కలిసి నాంపల్లిలోని సింగరేణి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు
డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణ, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి ముఖ్య డిమాండ్లను వినిపించారు.
సింగరేణి భావం ముట్టడి చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆ సమయంలో తోపులాట జరుగగా, కవితతో పాటు జాగృతి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
ఈ అరెస్ట్ సందర్భంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని , బొగ్గు బ్లాకుల వేలం పై పలు విమర్శలు లేవనెత్తారు ఎమ్మెల్సీ కవిత
సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్టులో 25% అవినీతి జరిగితే , అందులో 10% కాంగ్రెస్ నాయకులకే వెళ్తుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐని ఆశ్రయిస్తామని కవిత హెచ్చరించారు.

సింగరేణి కార్మికుల జీతాలపై ఆదాయపు పన్నును నిలిపివేయాలని అందువల్ల కార్మికులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆమె డిమాండ్ చేశారు.