చర్చ,గోదావరిఖని: ఘనంగా ఎల్ ఐ సి రామగుండం శాఖ ఆవిర్భావ దినోత్సవం…
ఎల్ ఐ సి రామగుండం శాఖ ఆవిర్భావ దినోత్సవం...

చర్చ,గోదావరిఖని:
ఘనంగా ఎల్ ఐ సి రామగుండం శాఖ ఆవిర్భావ దినోత్సవం…
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి) రామగుండం శాఖ స్థాపించి 38 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
బీమా రంగంలో ఎల్ ఐ సి దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందన్నారు. కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ ప్రజలకు నమ్మకంగా నిలిచిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అధికారులు బట్టారి ఆంజనేయులు, కట్టా శ్రీనివాస్, శంకరయ్య, బత్తుల మహేష్, వర్దినేని అవినాష్ రావు, శివకుమార్, వికాసాధికారులు ఎల్వి రమణారెడ్డి, పి.రవీందర్ రెడ్డి, పి.శ్రీనివాస్, డి.లక్ష్మారెడ్డి, ఏజెంట్ల సంఘం నాయకులు జనగామ సదయ్య, కటకం సతీష్, అంబాల బాబు, చింతల శ్రీనివాస్, జె.వి. రమణారావు, గుడికందుల రవి, భాస్కర్ల కుమారస్వామి, ఎస్. రమేష్, చింతం శ్రీనివాస్, మిట్ట సత్యం, కందుల శ్రీనివాస్, ఐ. శ్రీనివాస్, వి. తిరుపతిరెడ్డి, ఆర్. రవి, పి. నగేష్, కే. శ్రీధర్, ఎండి నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు