చర్చ,పెద్దపల్లి ప్రతినిది: మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి.
మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి.

చర్చ,పెద్దపల్లి ప్రతినిది:
మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి.
…………………………………..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని,ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ, సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రైతుకూలీ సంఘం,విప్లవ రచయితల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఏఐఎఫ్టియు నేతలు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలొ నేతలు మాట్లాడుతూ సామ్రాజ్యవాదులకోసం భారత సైన్యం దేశ పౌరులనే వేటాడటం అమానుషమని అన్నారు .మోడీ -అమిత్ షా ఓట్ చోర్ లేకాదు రక్తపిపాసులు అనేది నగ్నసత్యమన్నారు. మధ్య భారతం లోని ఖనిజాల కోసం రక్తపుటేరులు పారిస్తున్నారన్నారు.
ఆదివాసులను ఆడవుల్లో నుండి వెళ్లగొట్టేందకే మానవ హననం సాగిస్తున్నారని అన్నారు.
అడవులను, సహజ సంపదను కాపాడే అమాయక ఆదివాసులపై అమానుష దమన కాండ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ మావోయిస్టు పార్టీ తో శాంతి చర్చలు జరపాలని బుద్దిజీవులు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్న కేంద్రం మొండి వైఖరి వీడటం లేదన్నారు.
మారేడు మిల్లి అడవులోబూటకపు ఎన్కౌంటర్ లో అమరులైన కామ్రేడ్స్ మాడవి హిడ్మా, హేమ మరో నలుగురి మృతి పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని,మధ్యభారతంలోని పోలీస్ క్యాంపులనుఎత్తివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మొహరించిన సాయుధ పోలీస్ బలగాలను వెనక్కి రప్పించాలని, పోలీసుల అధీనంలో ఉన్న ఇతర మావోయిస్టు నాయకులకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టు లో హాజరుపరచాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలొ సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,
రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వెల్తురు సదానందం ,ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు కట్టా విశ్వనాధం ,దళిత హక్కుల పోరాట సమితి
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ ,
విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య
ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు, రత్న కుమార్
తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమురయ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు స్థాలిన్
ప్రజా సంఘాల నాయకులు లక్ష్మణ్, దీరజ్,తదితరులు పాల్గొన్నారు.