News & Views

చర్చ : హైదరాబాద్, మావోయిస్టు చీఫ్ తిప్పరి తిరుపతి ఆచూకీ ఎక్కడ?

మావోయిస్టు చీఫ్ తిప్పరి తిరుపతి ఆచూకీ ఎక్కడ?

నెక్ట్స్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్​ దేవ్ జీ..?

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ఎక్కడున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతమైన మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హీడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఈ క్రమంలో దేవ్ జీ, ఎక్కడున్నాడు అనే చర్చ ప్రారంభమైంది.. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, నిన్న జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడా? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…. అయితే ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీపీ, మహేష్ చంద్ర లడ్డా, మీడియా సమావేశంలో దేవ్ జీ,తను పోలీసుల అదుపులో లేరని ప్రకటించారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది చర్చ మొదలైంది…

మావోయిస్టులు తమ సానుభూతిపరులను విజయవాడతోపాటు ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహిం చేందుకు తమవెంట తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పలు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు అందిన సమాచారంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మరోవైపు భద్రత భద్రతా బలగాల నెక్ట్స్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్​ దేవ్ జీ..! ఇప్పుడు ఇతని కోసమే గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో దేవ్ జీ ఉన్నట్లు భద్రత బలగాల అనుమానం మొత్తంగా ఓవైపు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా..

మరోవైపు మావోయిస్టు దళాలకు, నాయకత్వానికి పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతునిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృషి సారించాయి.