News & Views

చర్చ, అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.

చర్చ:-అశ్వారావుపేట

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో టాటా ఏస్ వ్యాన్ ఆర్ టి సి బస్సుని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అశ్వారావుపేట నుండి సత్తుపల్లి వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సుని వడ్ల గూడెం నుండి వస్తున్న టాటా యేస్ వాహనం ముష్టిబండ అంతర్గత రోడ్డు నుంచి ఒక్కసారే జాతీయ రహదారి పైకి వచ్చి బస్సును బలంగా ఢీ కొట్టి ఎగిరి కరెంట్ పోల్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ నుజ్జునుజ్జు అవ్వగా ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బ తింది. కరెంట్ స్తంభం విరిగి పోవడంతో వైర్లు కిందపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యాన్ లో ఉన్న ఇద్దరికీ కాళ్లు చేతులు విరిగిపోగా క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి కావడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరా ఏర్పడింది. టాటా ఏస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది.